Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:06 PM

విద్యార్థుల్లో న్యాయ అవగాహన పెంపొందించుకోవాలి: జడ్జి ఎం. హిమబిందు

04-07-2026 116 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని జుక్కల్ శివారులో ఉన్న టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ విద్యాసంస్థలో శనివారం న్యాయ అవగాహన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి ఎం. హిమబిందు మాట్లాడుతూ, విద్యార్థులు తమ హక్కులతో పాటు విధుల గురించి తెలుసుకోవడం ఎంతో అవసరమని అన్నారు.సైబర్ నేరాల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని సూచించారు.అలాగే బాలల రక్షణ చట్టాలు, మహిళల భద్రత, విద్యార్థుల హక్కులు, న్యాయ సహాయం పొందే మార్గాలపై సులభంగా అర్థమయ్యే విధంగా వివరించారు.చట్టాలపై అవగాహన ఉండటం వల్ల నేరాలకు దూరంగా ఉండటంతో పాటు సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగవచ్చని తెలిపారు. విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు అలవరుచుకుని మంచి పౌరులుగా ఎదగాలని, ఎలాంటి సమస్య ఎదురైనా భయపడకుండా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు లేదా సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థుల్లో న్యాయ అవగాహన పెంపొందించుకోవాలి: జడ్జి ఎం. హిమబిందు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News