Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:12 PM

ప్రోటోకాల్ ఉల్లంఘనపై ఎంపీడీవోకు ఉప సర్పంచ్ ఫిర్యాదు

05-07-2026 67 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిన్నకాపర్తి గ్రామంలో మొక్కల పంపిణీ కార్యక్రమంపై ఆక్షేపణ.

చిట్యాల మండలంలోని చిన్నకాపర్తి గ్రామ పంచాయతీలో నిర్వహించిన మొక్కల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందని ఆరోపిస్తూ గ్రామ ఉప సర్పంచ్, వార్డు సభ్యురాలు బెల్లంకొండ లావణ్య ఎంపీడీవోకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.శనివారం ఎంపీడీవోకు అందజేసిన ఫిర్యాదు లేఖలో ఆమె పలు అంశాలను ప్రస్తావించారు. తన వార్డు పరిధిలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధిగా ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని, ఉప సర్పంచ్ హోదాలో ఉన్న తనను పూర్తిగా పక్కనపెట్టి మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారని పేర్కొన్నారు.

గ్రామ ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ వ్యవహారాల్లో ప్రజాప్రతినిధుల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు, ఇకపై గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమాలన్నింటికీ సంబంధిత ప్రజాప్రతినిధులకు ముందస్తు సమాచారం అందేలా ఆదేశాలు జారీ చేయాలని ఎంపీడీవోను ఆమె విజ్ఞప్తి చేశారు.

Sthanikam

ప్రోటోకాల్ ఉల్లంఘనపై ఎంపీడీవోకు ఉప సర్పంచ్ ఫిర్యాదు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News