Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:17 PM

ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ జిల్లా కో-ఆర్డినేటర్‌గా రెవరెండ్ జహంగీర్

05-07-2026 69 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట,

ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా కో-ఆర్డినేటర్‌గా యాదగిరిగుట్టకు చెందిన రెవరెండ్ జహంగీర్ జాన్ నియమితులైనట్లు సంస్థ జాతీయ అధ్యక్షుడు గద్దపాటి విజయ్ రాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా విజయ్ రాజు మాట్లాడుతూ, జిల్లాలో క్రైస్తవుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పనిచేయాలని జహంగీర్ జాన్‌ను కోరుతూ నియామక పత్రాన్ని అందజేశారు.

జహంగీర్ జాన్ మాట్లాడుతూ, గత 30 సంవత్సరాలుగా క్రైస్తవుల హక్కులు, సంక్షేమం కోసం చేస్తున్న సేవలను గుర్తించి ఈ బాధ్యత అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని అన్నారు.

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనే ప్రధాన డిమాండ్‌తో భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.

జిల్లా కో-ఆర్డినేటర్‌గా తన నియామకానికి సహకరించిన ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు గద్దపాటి విజయ్ రాజు, సంస్థ నాయకులకు జహంగీర్ జాన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ జిల్లా కో-ఆర్డినేటర్‌గా రెవరెండ్ జహంగీర్

Article Image

యాదగిరిగుట్ట,

ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా కో-ఆర్డినేటర్‌గా యాదగిరిగుట్టకు చెందిన రెవరెండ్ జహంగీర్ జాన్ నియమితులైనట్లు సంస్థ జాతీయ అధ్యక్షుడు గద్దపాటి విజయ్ రాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా విజయ్ రాజు మాట్లాడుతూ, జిల్లాలో క్రైస్తవుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పనిచేయాలని జహంగీర్ జాన్‌ను కోరుతూ నియామక పత్రాన్ని అందజేశారు.

జహంగీర్ జాన్ మాట్లాడుతూ, గత 30 సంవత్సరాలుగా క్రైస్తవుల హక్కులు, సంక్షేమం కోసం చేస్తున్న సేవలను గుర్తించి ఈ బాధ్యత అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని అన్నారు.

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనే ప్రధాన డిమాండ్‌తో భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.

జిల్లా కో-ఆర్డినేటర్‌గా తన నియామకానికి సహకరించిన ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు గద్దపాటి విజయ్ రాజు, సంస్థ నాయకులకు జహంగీర్ జాన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News