అక్రమ అరెస్టులు, పోలీసుల నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: తాటికొండ సీతయ్య
అక్రమ అరెస్టులు, పోలీసుల నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: తాటికొండ సీతయ్య
Bandi Kiran Kumar
బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్), మాజీ మంత్రి, జగదీష్ రెడ్డితో పాటు ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు మరియు ఇతర నాయకులను పోలీసులు నిర్బంధించడం, అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధ చర్య అని బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షులు, మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సముద్రంలో వృథాగా కలిసిపోతున్న గోదావరి జలాలను మెడిగడ్డ వద్ద నిల్వ చేసి, కన్నెపల్లి వద్ద మోటార్లు నడిపి కాలువల ద్వారా రైతాంగానికి సాగునీరు అందించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో వాస్తవ పరిస్థితులను పరిశీలించేందుకు బీఆర్ఎస్ నాయకులు ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరగా, వారి పర్యటనకు ఆటంకాలు సృష్టిస్తూ పోలీసులు నిర్బంధించడం దురదృష్టకరమని అన్నారు.గత రెండున్నర సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలతో పాలన సాగిస్తూ, మెడిగడ్డ వద్ద నీటిని నిల్వ చేయకుండా గోదావరి జలాలను సముద్రంలోకి వదులుతోందని విమర్శించారు. దీంతో యాసంగి సీజన్‌లో సాగునీటి కొరత ఏర్పడి రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు.వానాకాలం ప్రారంభమై 45 రోజులు గడిచినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక రైతులు సాగునీటి కోసం ఎదురుచూస్తున్న సమయంలో కూడా ప్రభుత్వం గోదావరి జలాలను వృథాగా సముద్రంలోకి వదలడం రైతాంగంపై నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని అన్నారు.అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని ఆరోపించిన తాటికొండ సీతయ్య, ప్రజలు మరియు రైతులు తగిన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, మండల నాయకులు తునికి సాయిలు, పోలేపాక సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి