Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:20 PM

దివ్యాంగుల హక్కుల కోసం వేదన దీక్ష జేఏసీ మద్దతు.. ఉస్మానియాలో పోస్టర్ ఆవిష్కరణ.

04-07-2026 220 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్,

దివ్యాంగుల హక్కుల పరిరక్షణ, ఆత్మగౌరవ సాధన కోసం సోషల్ జస్టిస్ పార్టీ చేపట్టనున్న వేదన దీక్షకు విశ్వవిద్యాలయాల దివ్యాంగుల జేఏసీ మద్దతు ప్రకటించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో శనివారం దీక్ష పోస్టర్‌ను ఆవిష్కరించి, రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులు, మేధావులు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్. అశోక్ మాట్లాడుతూ, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగుల హక్కులను చట్టబద్ధంగా అమలు చేసి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కొత్తపేట హుడా కాంప్లెక్స్ వద్ద నిర్వహించే ఈ వేదన దీక్ష దివ్యాంగుల భవిష్యత్తుకు కీలక మలుపు అవుతుందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో రాజ్యాధికారం ఫోరం అధ్యక్షుడు వంశీరాజ్ రామచంద్ర, కె. రాజ్యలక్ష్మి, బండి శ్రీనివాసరావు, మారవేణి చంద్రశేఖర్ యాదవ్, పల్స ఆంజనేయులు గౌడ్, మోదాల సైదులు యాదవ్, కస్తూరి వేణుగోపాల్ రెడ్డి, దానమ్మ తదితరులు పాల్గొని దీక్షకు సంఘీభావం ప్రకటించారు.

Sthanikam

దివ్యాంగుల హక్కుల కోసం వేదన దీక్ష జేఏసీ మద్దతు.. ఉస్మానియాలో పోస్టర్ ఆవిష్కరణ.

Article Image

హైదరాబాద్,

దివ్యాంగుల హక్కుల పరిరక్షణ, ఆత్మగౌరవ సాధన కోసం సోషల్ జస్టిస్ పార్టీ చేపట్టనున్న వేదన దీక్షకు విశ్వవిద్యాలయాల దివ్యాంగుల జేఏసీ మద్దతు ప్రకటించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో శనివారం దీక్ష పోస్టర్‌ను ఆవిష్కరించి, రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులు, మేధావులు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్. అశోక్ మాట్లాడుతూ, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగుల హక్కులను చట్టబద్ధంగా అమలు చేసి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కొత్తపేట హుడా కాంప్లెక్స్ వద్ద నిర్వహించే ఈ వేదన దీక్ష దివ్యాంగుల భవిష్యత్తుకు కీలక మలుపు అవుతుందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో రాజ్యాధికారం ఫోరం అధ్యక్షుడు వంశీరాజ్ రామచంద్ర, కె. రాజ్యలక్ష్మి, బండి శ్రీనివాసరావు, మారవేణి చంద్రశేఖర్ యాదవ్, పల్స ఆంజనేయులు గౌడ్, మోదాల సైదులు యాదవ్, కస్తూరి వేణుగోపాల్ రెడ్డి, దానమ్మ తదితరులు పాల్గొని దీక్షకు సంఘీభావం ప్రకటించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News