Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:17 PM

రూ.10 వేల కోట్ల అప్పు లెక్కల్లో తేడా.. ప్రభుత్వం సమాధానం చెప్పాలి. చిరుమర్తి లింగయ్య

03-07-2026 100 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సీఎంది ఒక లెక్క.. మంత్రిది మరో లెక్క

ప్రభుత్వ అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి.

యాదాద్రి ట్రస్ట్ బోర్డులో నల్గొండకు చోటు కల్పించకపోవడం అవమానకరం: చిరుమర్తి లింగయ్య.

రామన్నపేట

రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పుల లెక్కల్లోనే తీవ్ర వ్యత్యాసాలు ఉన్నాయని, ప్రజలను తప్పుదోవ పట్టించకుండా వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం రామన్నపేట మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

2023 డిసెంబర్ నుంచి 2026 జూన్ వరకు ఎఫ్ఆర్బీఎం (FRBM) కింద ప్రభుత్వం రూ.1,86,087 కోట్ల అప్పు తీసుకువచ్చిందని అధికారిక లెక్కలు చెబుతున్నాయని, అయితే మంత్రి జూపల్లి కృష్ణారావు పంపిన లేఖలో రూ.1,77,058 కోట్లుగా పేర్కొన్నారని తెలిపారు. ఈ రెండు లెక్కల మధ్య దాదాపు రూ.10 వేల కోట్ల వ్యత్యాసం ఎందుకు వచ్చిందో ప్రభుత్వం ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.

2026 మార్చి 18న అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వం 27 నెలల్లో రూ.3,47,294 కోట్ల అప్పు చేసిందని ప్రకటించారని, అదే సమయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు వేరే లెక్కలు చెబుతున్నారని పేర్కొన్నారు. "ముఖ్యమంత్రి చెప్పిందే నిజమా? మంత్రి చెప్పిందే నిజమా?" అని ప్రశ్నించారు.

అసెంబ్లీలో ప్రభుత్వం చేసిన ఆరోపణలకు తాము ఆధారాలతో సమాధానం ఇచ్చామని, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.4 లక్షల కోట్లేనని నిరూపించామని తెలిపారు. కాగ్ నివేదికలో కూడా రూ.4.15 లక్షల కోట్ల అప్పు నమోదైందని పేర్కొంటూ ప్రభుత్వం వాస్తవాలను వక్రీకరిస్తూ గోబెల్స్ ప్రచారం చేస్తోందని విమర్శించారు.

యాదాద్రి దేవస్థానం ట్రస్ట్ బోర్డులో నల్గొండ జిల్లాకు చెందిన ఒక్కరికీ అవకాశం కల్పించకపోవడం జిల్లా ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్య అని చిరుమర్తి లింగయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

Sthanikam

రూ.10 వేల కోట్ల అప్పు లెక్కల్లో తేడా.. ప్రభుత్వం సమాధానం చెప్పాలి. చిరుమర్తి లింగయ్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News