Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:19 AM

ఎన్నికలు వద్దు – విలీనం ముద్దు అంశంపై జూలై 6న రౌండ్ టేబుల్ సమావేశం

03-07-2026 227 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనుబంధ కార్మిక సంఘమైన బహుజన వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో "ఎన్నికలు వద్దు – విలీనం ముద్దు" అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు యూనియన్ రాష్ట్ర నాయకత్వం వెల్లడించింది.

ఈ సమావేశం 2026 జూలై 6 (సోమవారం) మధ్యాహ్నం 1:30 గంటలకు, హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం, షోయబ్ హాల్లో నిర్వహించబడుతుంది.

తెలంగాణ ఆర్టీసీలోని అన్ని ట్రేడ్ యూనియన్లు, అన్ని ఉద్యోగ సంఘాలు (అసోసియేషన్లు), రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు మరియు ముఖ్య నాయకులు ఈ సమావేశానికి హాజరై తమ అమూల్యమైన అభిప్రాయాలు, సూచనలు అందించాలని యూనియన్ కోరింది.

ఆర్టీసీ ప్రభుత్వ విలీన ప్రక్రియను వేగవంతం చేయడం, గత ప్రభుత్వం తీసుకొచ్చిన తెలంగాణ చట్టం నెం. 07 ఆఫ్ 2023ను ప్రస్తుత ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయించడం, అలాగే కార్మికుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఐక్య కార్యాచరణ రూపొందించడం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొంది.

బహుజన వర్కర్స్ యూనియన్ 2026 జూన్ 21న తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనుబంధ కార్మిక సంఘంగా ఏర్పడి, "సంపూర్ణ ఉద్యోగ భద్రతతో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి" అనే ఏకైక లక్ష్యంతో ఉద్యమాన్ని కొనసాగిస్తోందని నాయకత్వం వెల్లడించింది.

కావున అన్ని కార్మిక సంఘాల నాయకులు మరియు అసోసియేషన్ నాయకులు సమయానికి సమావేశానికి హాజరై ఆర్టీసీ కార్మికుల భవిష్యత్తు కోసం ఐక్య పోరాటానికి సహకరించాలని బహుజన వర్కర్స్ యూనియన్ విజ్ఞప్తి చేసింది.

Sthanikam

ఎన్నికలు వద్దు – విలీనం ముద్దు అంశంపై జూలై 6న రౌండ్ టేబుల్ సమావేశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News