Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:10 PM

ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలే లక్ష్యం.. కల్హేర్‌లో నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభం

03-07-2026 180 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కల్హేర్ మండల కేంద్రంలో నూతనంగా పునరుద్ధరించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, సంగారెడ్డి జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలు, పోలీసు సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గతంలో శిథిలావస్థకు చేరిన భవనంలో పోలీస్ స్టేషన్ కొనసాగడంతో సిబ్బంది, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అందుకే ఖాళీగా ఉన్న పాత ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని మరమ్మతులు చేసి అన్ని మౌలిక వసతులతో పోలీస్ స్టేషన్‌గా అభివృద్ధి చేశామని వివరించారు. అలాగే గత ప్రభుత్వం ప్రభుత్వ భవనాల నిర్వహణను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కార్యక్రమంలో నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, సీఐ వెంకట్ రెడ్డి, వివిధ మండలాల ఎస్‌ఐలు, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలే లక్ష్యం.. కల్హేర్‌లో నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభం

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కల్హేర్ మండల కేంద్రంలో నూతనంగా పునరుద్ధరించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, సంగారెడ్డి జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలు, పోలీసు సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గతంలో శిథిలావస్థకు చేరిన భవనంలో పోలీస్ స్టేషన్ కొనసాగడంతో సిబ్బంది, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అందుకే ఖాళీగా ఉన్న పాత ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని మరమ్మతులు చేసి అన్ని మౌలిక వసతులతో పోలీస్ స్టేషన్‌గా అభివృద్ధి చేశామని వివరించారు. అలాగే గత ప్రభుత్వం ప్రభుత్వ భవనాల నిర్వహణను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కార్యక్రమంలో నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, సీఐ వెంకట్ రెడ్డి, వివిధ మండలాల ఎస్‌ఐలు, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News