Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:59 PM

చౌటుప్పల్‌లో గంజాయి చాక్లెట్ల కలకలం.. ఇద్దరు వ్యక్తుల అరెస్ట్!

03-07-2026 190 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి చాక్లెట్లు పట్టుబడటం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చౌటుప్పల్ ఎస్‌హెచ్‌ఓ (ఇన్‌స్పెక్టర్) జి. మన్మధ కుమార్ ఆదేశాల మేరకు గురువారం ఎస్సై సూర కృష్ణ మాల్ తన సిబ్బందితో కలిసి పరిధిలోని వివిధ ప్రాంతాలలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.​ చౌటుప్పల్ సమీపంలోని సూర్యోదయ స్పిన్నింగ్ మిల్లు వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద ఉన్న బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆ తనిఖీల్లో బ్యాగులో దాచి ఉంచిన 48 గంజాయి చాక్లెట్లు లభ్యమయ్యాయి.

​పోలీసుల విచారణలో పట్టుబడిన నిందితులు మోహన్ మహలిక్ (28) తండ్రి రామలంతా మహలిక్, వృత్తి రీత్యా కూలీ, ఒడిస్సా రాష్ట్ర నివాసి.​దీనబంధు సాహూ (32) తండ్రి శ్రీకాంత్ సాహో, వృత్తి రీత్యా కూలీ, ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా షామీర్‌పేట్ పరిధిలోని మజీద్‌పూర్‌లో నివసిస్తున్నాడు. పట్టుబడిన గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్న చౌటుప్పల్ పోలీసులు, నిందితులిద్దరిపై చట్టరీత్యా కేసు నమోదు చేశారు. ఈ చాక్లెట్లను ఎక్కడి నుండి తీసుకువచ్చారు? ఎవరికి విక్రయించడానికి ప్రయత్నిస్తున్నారు? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించినట్లు ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్ తెలిపారు.

Sthanikam

చౌటుప్పల్‌లో గంజాయి చాక్లెట్ల కలకలం.. ఇద్దరు వ్యక్తుల అరెస్ట్!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News