నల్గొండ పట్టణానికి చెందిన అనంతల హిమని అమెరికాలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమితులై జిల్లా ప్రతిష్ఠను అంతర్జాతీయ స్థాయిలో చాటారు. ఆమె అమెరికాలోని ప్రముఖ కెలాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ విభాగంలో పీహెచ్‌డీ పూర్తి చేశారు.
తాజాగా అమెరికాలోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ పరిధిలోని ఎలీ బ్రాడ్ కాలేజ్ ఆఫ్ బిజినెస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు హిమని భారతదేశంలోని ఐఐటీ బాంబేలో మెకానికల్ ఇంజినీరింగ్‌లో పట్టా పొందారు.
నల్గొండకు చెందిన యువతి అంతర్జాతీయ విద్యా రంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవడం పట్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు, జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి