Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:54 PM

చౌటుప్పల్‌లో ‘బీసీ బంద్’ సక్సెస్

చౌటుప్పల్‌లో ‘బీసీ బంద్’ సక్సెస్

చౌటుప్పల్‌లో ‘బీసీ బంద్’ సక్సెస్
02-07-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

* మూతపడిన జూనియర్, డిగ్రీ కళాశాలలు

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయరు.. పేద విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారు.. విద్య అనేది హక్కు, వ్యాపారం కాదు" అంటూ బీసీ విద్యార్థి, యువజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాష్ట్రవ్యాప్త బీసీ జేఏసీ పిలుపులో భాగంగా గురువారం చౌటుప్పల్ పట్టణంలో నిర్వహించిన బీసీ బంద్ పూర్తి విజయవంతమైంది. పట్టణంలోని జూనియర్, డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు బంద్‌కు స్వచ్ఛందంగా మద్దతు పలికారు.​ బీసీ నేత వీరమళ్ళ కార్తీక్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో వేలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. విద్యార్థులు అప్పులు చేసి చదువుకోవాల్సిన దుస్థితిని ప్రభుత్వం కల్పించిందని విమర్శించారు."ఆదాయ పరిమితులు, కొత్త నిబంధనల పేరుతో పేదలను చదువుకు దూరం చేయాలని చూస్తే ఊరుకోం. పాత విధానాన్నే కొనసాగించి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలి."

​రాజ్యాంగం కల్పించిన విద్యా హక్కులను ప్రభుత్వం హరించాలని చూస్తోందని, బకాయిలు తక్షణమే విడుదల చేయకపోతే విద్యార్థి, యువజన, బీసీ సంఘాలను ఏకం చేసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు బండి గారి శ్రీధర్, కొప్పు రామకృష్ణ, నవీన్, భరత్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్‌లో ‘బీసీ బంద్’ సక్సెస్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News