Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:00 PM

ప్రాణదాతలైన వైద్యుల సేవలు వెలకట్టలేనివి: మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

01-07-2026 71 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు

​సమాజంలో ప్రాణదాతలైన వైద్యుల సేవలు వెలకట్టలేనివని చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో ఆసుపత్రిలోని వైద్యులను, సిబ్బందిని పూలబొకేలు, శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.​అనంతరం ఆమె మాట్లాడుతూ.. సమాజంలో డాక్టర్లకు దేవునితో సమానమైన స్థానం ఉందన్నారు. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం అందించడంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ, అత్యవసర సమయాల్లోనూ తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వైద్యులు అందించిన సేవలు ఎప్పటికీ మరువలేనివని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఎండి హన్నుబాయ్, కో ఆప్షన్ సభ్యులు బాబా షరీఫ్, డిసిసి కార్యదర్శి చింతల సాయిలు, యువజన కాంగ్రెస్ నాయకులు సుర్కంటి బాలకృష్ణ రెడ్డి, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

ప్రాణదాతలైన వైద్యుల సేవలు వెలకట్టలేనివి: మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

Article Image

చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు

​సమాజంలో ప్రాణదాతలైన వైద్యుల సేవలు వెలకట్టలేనివని చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో ఆసుపత్రిలోని వైద్యులను, సిబ్బందిని పూలబొకేలు, శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.​అనంతరం ఆమె మాట్లాడుతూ.. సమాజంలో డాక్టర్లకు దేవునితో సమానమైన స్థానం ఉందన్నారు. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం అందించడంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ, అత్యవసర సమయాల్లోనూ తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వైద్యులు అందించిన సేవలు ఎప్పటికీ మరువలేనివని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఎండి హన్నుబాయ్, కో ఆప్షన్ సభ్యులు బాబా షరీఫ్, డిసిసి కార్యదర్శి చింతల సాయిలు, యువజన కాంగ్రెస్ నాయకులు సుర్కంటి బాలకృష్ణ రెడ్డి, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News