Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:32 PM

యాదాద్రి ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా నియమితులైన పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్‌కు ఘన సన్మానం

01-07-2026 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రంగారెడ్డి, జూలై 1: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా నియమితులైన పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్‌కు ఆమె నివాసంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అభిమానులు ఘనంగా సన్మానం నిర్వహించారు. శాలువా కప్పి, పూల బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా టీపీసీసీ ప్రచార కమిటీ సహ-సమన్వయకర్త వజీర్ ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ, ఈశ్వరమ్మ యాదవ్ సేవలను గుర్తించి యాదాద్రి ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కర్మన్‌ఘాట్ ఆంజనేయస్వామి దేవాలయ చైర్మన్‌గా ఆమె నిజాయితీతో సేవలందించిన అనుభవమే ఈ బాధ్యతకు కారణమని పేర్కొన్నారు. ప్రజల మధ్య ఉంటూ పేదలకు అండగా నిలిచిన నాయకురాలిగా ఈశ్వరమ్మ మంచి గుర్తింపు పొందారని అన్నారు.

తెలుగుదేశం పార్టీ ప్రారంభ దశ నుంచే రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఈశ్వరమ్మ యాదవ్ ప్రజాసేవలో విశేషంగా పనిచేశారని, ప్రస్తుతం యాదాద్రి వంటి ప్రతిష్ఠాత్మక దేవస్థానం ట్రస్ట్ బోర్డులో సభ్యురాలిగా నియామకం కావడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేవస్థానం అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి యాదాద్రి ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా నియమించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కర్మన్‌ఘాట్ సహా పలు దేవాలయాల కమిటీల్లో పనిచేసిన అనుభవంతో యాదాద్రి దేవస్థానం అభివృద్ధికి తన వంతు సేవలు అందిస్తానని చెప్పారు. తనకు సహకరించిన మధు యాష్కి, మల్‌రెడ్డి రామిరెడ్డి, బీర్ల ఐలయ్య, వేముల నరేందర్ రెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను పారదర్శకంగా, న్యాయబద్ధంగా నిర్వహిస్తానని స్పష్టం చేశారు.

వనస్థలిపురం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కూరెళ్ల వేములయ్య గౌడ్ మాట్లాడుతూ, దేవాలయాల అభివృద్ధిలో విశేష అనుభవం ఉన్న ఈశ్వరమ్మ యాదవ్‌కు యాదాద్రి ట్రస్ట్ బోర్డు సభ్యురాలి బాధ్యతలు అప్పగించడం సరైన నిర్ణయమని అన్నారు. ఆమె అనుభవం దేవస్థానం అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార కమిటీ సహ-సమన్వయకర్త వజీర్ ప్రకాష్ గౌడ్, వనస్థలిపురం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కూరెళ్ల వేములయ్య గౌడ్, కాంగ్రెస్ యువ నాయకుడు పోచబోయిన సురేష్ యాదవ్, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అభిమానులు, బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

యాదాద్రి ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా నియమితులైన పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్‌కు ఘన సన్మానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News