Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:27 AM

లెక్కల మాస్టారైన జిల్లా కలెక్టర్

లెక్కల మాస్టారైన జిల్లా కలెక్టర్

లెక్కల మాస్టారైన జిల్లా కలెక్టర్
01-07-2026 67 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు గణితం బోధించిన తేజస్ నంద్ లాల్ పవార్

హుజూర్‌నగర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా తరగతి గదిలోకి వెళ్లిన కలెక్టర్ విద్యార్థినులతో ముచ్చటించి చదువు, బోధనపై ఆరా తీశారు. అనంతరం చేతిలో చాక్‌పీస్ పట్టుకుని బ్లాక్‌బోర్డుపై స్వయంగా గణిత పాఠాలు బోధిస్తూ విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు.

విద్యార్థులు గణితంలో ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న కలెక్టర్, క్లిష్టమైన సూత్రాలను సులభంగా అర్థమయ్యేలా వివరించారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదివితే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని విద్యార్థులకు సూచించారు. ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై చదువుపై ఏకాగ్రత పెంచుకోవాలని అన్నారు.

అనంతరం పాఠశాల ఆవరణను పరిశీలించిన కలెక్టర్ మధ్యాహ్న భోజన పథకం అమలుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పనపై ప్రధానోపాధ్యాయులతో చర్చించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

లెక్కల మాస్టారైన జిల్లా కలెక్టర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News