Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:10 PM

హైదరాబాద్ మార్గంలో ఎలక్ట్రిక్ బస్సుల దుస్థితి

01-07-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

లైట్లు లేక రాత్రి ప్రయాణం.. మెయింటెనెన్స్ లేక డ్రైవర్లు, ప్రయాణికుల అవస్థలు.

జీతాల చెల్లింపులోనూ జాప్యం.. యాజమాన్యంపై ఉద్యోగుల ఆవేదన

సూర్యాపేట–హైదరాబాద్ మార్గంలో నడిచే ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీస మెయింటెనెన్స్ లేకుండా బస్సులను రోడ్డుపైకి పంపుతున్నారని డ్రైవర్లు, ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో కొన్ని బస్సుల్లో లైట్లు సరిగా పనిచేయకపోవడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారుతోందని వారు చెబుతున్నారు.

బస్సుల్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను యాజమాన్యం పట్టించుకోవడం లేదని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. వాహనాల్లో ఎలాంటి టెక్నికల్ ఇష్యూలు ఉన్నా వాటిని పరిష్కరించకుండా అలాగే నడపాలని ఒత్తిడి తెస్తున్నారని వాపోతున్నారు. సమస్యలపై డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లగా, “నడపగలిగితే నడపండి.. లేకుంటే పక్కకు పెట్టి వెళ్లండి” అంటూ నిర్లక్ష్యంగా స్పందిస్తున్నారని కొందరు డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు ఉద్యోగులకు జీతాలు కూడా సకాలంలో చెల్లించడం లేదని సమాచారం. దీంతో ఉద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతోందని తెలుస్తోంది. బస్సుల నిర్వహణ లోపాల కారణంగా డ్రైవర్లతో పాటు ప్రయాణికులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఎలక్ట్రిక్ బస్సులకు తగిన మరమ్మతులు చేపట్టి, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రయాణికులు, ఉద్యోగులు కోరుతున్నారు. ప్రయాణ భద్రత విషయంలో నిర్లక్ష్యం ప్రాణాంతక పరిణామాలకు దారితీయవచ్చని వారు హెచ్చరిస్తున్నారు.

Sthanikam

హైదరాబాద్ మార్గంలో ఎలక్ట్రిక్ బస్సుల దుస్థితి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News