Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:13 PM

దేవరకొండలో ఎక్సైజ్ దాడులు.. నాటుసారా గుట్టురట్టు

01-07-2026 68 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నలుగురిపై కేసులు నమోదు.. ఇద్దరి అరెస్ట్.. 600 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

దేవరకొండ, జూలై 1: నల్లగొండ జిల్లా దేవరకొండ మండలంలో అక్రమ మద్యం తయారీ, విక్రయాలపై ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం మోపింది. దేవరకొండ ఎక్సైజ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో నాటుసారా తయారీ, విక్రయాలకు పాల్పడుతున్న వ్యక్తులను గుర్తించి కేసులు నమోదు చేశారు.

మండల పరిధిలోని కొర్ర తండా, జటావత్ తండాలలో ఎక్సైజ్ పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టగా, నాటుసారా తయారీ, విక్రయాలకు సంబంధించిన నాలుగు కేసులు వెలుగుచూశాయి. ఈ సందర్భంగా ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి ఆరు లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు.

అదే సమయంలో నాటుసారా తయారీకి సిద్ధంగా ఉంచిన సుమారు 600 లీటర్ల బెల్లం ఊట (ఎఫ్‌జే వాష్)ను గుర్తించిన అధికారులు, దానిని ఘటనా స్థలంలోనే ధ్వంసం చేశారు. అక్రమ మద్యం తయారీ కేంద్రాలపై నిరంతర నిఘా కొనసాగిస్తున్నామని, ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే నాటుసారా తయారీ, విక్రయాలను ఏమాత్రం ఉపేక్షించబోమని ఎక్సైజ్ అధికారులు స్పష్టం చేశారు.

గ్రామాలు, తండాల్లో నాటుసారా తయారీ, విక్రయం లేదా రవాణా జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే ఎక్సైజ్ లేదా పోలీసు అధికారులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అక్రమ మద్యం నిర్మూలనకు ప్రత్యేక చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

Sthanikam

దేవరకొండలో ఎక్సైజ్ దాడులు.. నాటుసారా గుట్టురట్టు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News