Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 06:32 AM

ఎమ్మెల్యేసార్ ...ఇందిరమ్మ బిల్లు ఇప్పించండి! బాధితురాలు ఆవేదన

30-06-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన భాగంగా పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి 2500 చొప్పున ఇండ్లు మంజూరయ్యాయి. దీనిలో భాగంగా మొదటి దఫలో2025లో మంగలి కులంలో ఏకైక వ్యక్తి జలగం. మమతకు తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు చేతుల మీదుగా పంపిణీ శ్రీకారం చుట్టారు. లబ్ధిదారుడు సంబంధిత తుంగతుర్తి అధికారులతో ముగ్గుబోసి, ఇంటి నిర్మాణం చేపట్టాడు. ఇంటి నిర్మాణ పనులు మొదలుపెట్టిన లబ్ధిదారులు బేస్మెంట్ పనులు పూర్తి చేసుకొని, మొదటి విడత బిల్లు కోసం అధికారులను సంప్రదించగా మీ పేర ఇల్లు మంజూరు కాలేదని ఐడి నెంబర్ తప్పుగా పడిందని మీరుపై అధికారులను కలవండని తిప్పుతూ కాలం గడిపించారు. సదరు కుటుంబ సభ్యులు ఒకసారి ప్రజావాణిలో కూడా సమస్యను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

ప్రతిరోజు కూలి పని చేసుకొని కుటుంబ జీవనం సాగించే మేము అధికారులు చేసిన పొరపాటు వల్ల నడి రోడ్డున పడ్డామని, ప్రస్తుతం 3000 రూపాయలు ప్రతి నెలకు అద్దె చెల్లిస్తూ జీవనం సాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సుమారు రెండు లక్షల రూపాయలు అప్పుగా తీసుకొచ్చి, ఇంటి నిర్మాణం చేశామని లబ్ధిదారులు కన్నీరు పర్యంతమవుతున్నారు. ఇల్లు ముగ్గు పోసే టైం లో సంబంధిత గ్రామపంచాయతీ కార్యదర్శి, హౌసింగ్ ఏఈ సహకారంతోనే, నిర్మాణం చేపట్టినట్లు చెబుతున్నారు. జరిగిన సంఘటనపై జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు విచారణ జరిపించి, తప్పు చేసిన అధికారులపై, శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కోరుతున్నారు.

Sthanikam

ఎమ్మెల్యేసార్ ...ఇందిరమ్మ బిల్లు ఇప్పించండి! బాధితురాలు ఆవేదన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News