Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్నేహానికి చావు లేదు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:55 PM

గురువు ఋణం తీర్చుకున్న శిష్యుడు!

గురువు ఋణం తీర్చుకున్న శిష్యుడు!

గురువు ఋణం తీర్చుకున్న శిష్యుడు!
30-06-2026 215 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​* సూర్యాపేట ఎస్పీ కే. నరసింహ చేతుల మీదుగా ఉపాధ్యాయుడికి ఘన సత్కారం

* జడ్పీహెచ్‌ఎస్ చిన్నకొండూరులో దోటి రాములు అండాలుకు ఆత్మీయ వీడ్కోలు

సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని, విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేసే గురువుల సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని సూర్యాపేట జిల్లా ఎస్పీ కే. నరసింహ (ఐపీఎస్) కొనియాడారు. చౌటుప్పల్ మండలం చిన్నకొండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో భౌతికశాస్త్ర స్కూల్ అసిస్టెంట్‌గా సుదీర్ఘ సేవలందించి పదవీ విరమణ చేసిన దోటి రాములు అండాలు ఆత్మీయ వీడ్కోలు సమావేశం మంగళవారం పాఠశాల ఆవరణలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై, తన పూర్వ గురువును శాలువాతో ఘనంగా సత్కరించారు. ​ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ.. తనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువు ఉద్యోగ విరమణ మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానంటూ భావోద్వేగానికి లోనయ్యారు. రాములు అండాలు తన సుదీర్ఘ సేవా కాలంలో ఎంతోమంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చారని ప్రశంసించారు. అనంతరం పదవీ విరమణ పొందిన దోటి రాములు అండాలు మాట్లాడుతూ.. తన విధి నిర్వహణకు సహకరించిన విద్యాశాఖ అధికారులు, సహచర ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, ప్రజాప్రతినిధులు, పూర్వ విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొని ఉపాధ్యాయ దంపతులను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు అందజేశారు.

Sthanikam

గురువు ఋణం తీర్చుకున్న శిష్యుడు!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News