Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:37 AM

పౌర హక్కులపై అవగాహన కలిగి ఉండాలి’; ఎస్సై శ్రీకాంత్ కుమార్

30-06-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

పౌర హక్కులపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని తుంగతుర్తి ఎస్ఐ క్రాంతి కుమార్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని అన్నారం గ్రామంలో పోలీస్, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో సివిల్ రైట్స్ డే’ (పౌర హక్కుల దినోత్సవం) ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామ ప్రజలకు పౌర హక్కులపై అవగాహన కల్పించి మాట్లాడారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సమానమేనని, కుల వివక్షకు వ్యతిరేకంగా అందరూ కలిసికట్టుగా నడవాలని పిలుపునిచ్చారు. చట్టం ముందు అందరూ సమానులేనని, ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం, పౌర హక్కుల చట్టాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. గ్రామంలో ఎలాంటి అంటరానితనం, వివక్షకు తావులేకుండా సామరస్యపూర్వక వాతావరణంలో జీవించాలని కోరారు. గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్న అధికారులు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అన్నారం గ్రామ సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి, రెవెన్యూ అధికారులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

పౌర హక్కులపై అవగాహన కలిగి ఉండాలి’; ఎస్సై శ్రీకాంత్ కుమార్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News