Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:27 PM

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. ఎం. మనోహర్ సందేశం

30-06-2026 21 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి, :

ప్రజల ప్రాణాలను కాపాడుతూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో వైద్యులు పోషిస్తున్న పాత్ర అమూల్యమని జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ అధికారి (DM&HO) డా. ఎం. మనోహర్ పేర్కొన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులందరికీ ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

భారతదేశంలో ప్రతి ఏడాది జూలై 1న ప్రముఖ వైద్యుడు, విద్యావేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి డా. బిధాన్ చంద్ర రాయ్ జయంతి, వర్ధంతి సందర్భంగా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని తెలిపారు. వైద్య వృత్తి కేవలం ఉపాధి మార్గం మాత్రమే కాదని, మానవాళి ప్రాణాలను కాపాడే అత్యంత పవిత్రమైన సేవా వృత్తి అని అన్నారు.

వైద్యులు తమ విజ్ఞానం, అనుభవం, కరుణ, అంకితభావంతో ప్రతి రోగికి ఆరోగ్యాన్ని, ఆశను, కొత్త జీవితాన్ని అందిస్తున్నారని కొనియాడారు. కోవిడ్ మహమ్మారి వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ వ్యక్తిగత జీవితాలను పక్కనపెట్టి ప్రజల కోసం అహర్నిశలు సేవలందించిన వైద్యుల త్యాగం చిరస్మరణీయమని పేర్కొన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఒక పట్టణ ఆరోగ్య కేంద్రం, నాలుగు బస్తీ దవాఖానాలు, 99 ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిర్‌లు, మూడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 23 ఆయుష్ డిస్పెన్సరీలు, ఒక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ద్వారా ప్రజలకు సమగ్ర వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. అలాగే బీబీనగర్ ఎయిమ్స్ ద్వారా అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని వివరించారు.

మాతా–శిశు సంక్షేమం, టీకాల కార్యక్రమం, కుటుంబ నియంత్రణ, క్షయవ్యాధి నిర్మూలన, డెంగ్యూ, మలేరియా నియంత్రణ, మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ వంటి అసంక్రమిత వ్యాధుల గుర్తింపు, చికిత్స, ఆరోగ్య అవగాహన కార్యక్రమాల అమలులో వైద్యులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.

ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల వైద్యులు ప్రతి రోగిని తమ కుటుంబ సభ్యుడిగా భావించి సేవలందిస్తున్నారని, వారి నిబద్ధత, మానవత్వం, సేవాభావం సమాజానికి ఆదర్శమని డా. మనోహర్ అన్నారు. వైద్య వృత్తి గౌరవాన్ని కాపాడడం ప్రతి పౌరుడి బాధ్యత అని, వైద్యుల పట్ల విశ్వాసం, పరస్పర గౌరవంతో వ్యవహరించినప్పుడే ప్రజారోగ్య వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా జిల్లాలోని ప్రతి వైద్యుడికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇదే సేవా స్ఫూర్తితో ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు.

Sthanikam

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. ఎం. మనోహర్ సందేశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News