Sthanikam - Truth Matters
Logo

చిట్యాలలో ఒంటరిగా తిరుగుతున్న బాలుడు.. పోలీసుల సంరక్షణలోకి

Updated : 30 Jun 2026 15:57 IST
As Preferred Source 1 min read
చిట్యాలలో ఒంటరిగా తిరుగుతున్న బాలుడు.. పోలీసుల సంరక్షణలోకి

చిట్యాల: పట్టణంలోని కెనరా బ్యాంకు సమీపంలో ఓ బాలుడు ఒంటరిగా తిరుగుతూ ఉండగా స్థానికులు గమనించి అప్రమత్తమయ్యారు. బాలుడు ఎవరితోనూ లేకుండా సంచరిస్తుండటంతో అతని భద్రత దృష్ట్యా స్థానికులు వెంటనే అతనిని చిట్యాల పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి పోలీసులకు అప్పగించారు.

ప్రస్తుతం బాలుడు పోలీసుల సంరక్షణలో ఉన్నట్లు సమాచారం. బాలుడి వివరాలు తెలియరాకపోవడంతో అతని తల్లిదండ్రులు లేదా బంధువుల కోసం పోలీసులు ప్రయత్నాలు చేపట్టారు.

ఈ బాలుడిని గుర్తించే వారు లేదా అతని కుటుంబ సభ్యులెవరైనా ఉంటే వెంటనే చిట్యాల పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. బాలుడిని గుర్తించి సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు సహకరించాలని కోరారు.

Sthanikam

చిట్యాలలో ఒంటరిగా తిరుగుతున్న బాలుడు.. పోలీసుల సంరక్షణలోకి

Article Image

చిట్యాల: పట్టణంలోని కెనరా బ్యాంకు సమీపంలో ఓ బాలుడు ఒంటరిగా తిరుగుతూ ఉండగా స్థానికులు గమనించి అప్రమత్తమయ్యారు. బాలుడు ఎవరితోనూ లేకుండా సంచరిస్తుండటంతో అతని భద్రత దృష్ట్యా స్థానికులు వెంటనే అతనిని చిట్యాల పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి పోలీసులకు అప్పగించారు.

ప్రస్తుతం బాలుడు పోలీసుల సంరక్షణలో ఉన్నట్లు సమాచారం. బాలుడి వివరాలు తెలియరాకపోవడంతో అతని తల్లిదండ్రులు లేదా బంధువుల కోసం పోలీసులు ప్రయత్నాలు చేపట్టారు.

ఈ బాలుడిని గుర్తించే వారు లేదా అతని కుటుంబ సభ్యులెవరైనా ఉంటే వెంటనే చిట్యాల పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. బాలుడిని గుర్తించి సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు సహకరించాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి