Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:00 PM

అఖిలపక్ష పోరాటానికి తొలి విజయం : చౌటుప్పల్‌లో మౌంట్ లిటెరా జీ స్కూల్ సీజ్

30-06-2026 198 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​* నిబంధనలు ఉల్లంఘిస్తే ఏ ప్రైవేట్ పాఠశాలనైనా వదలం: విద్యార్థి, యువజన సంఘాల హెచ్చరిక

ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ నడుస్తున్న చౌటుప్పల్ మండలంలోని మౌంట్ లిటెరా జీ స్కూల్‌ను మండల విద్యాధికారి సీజ్ చేయడం అఖిలపక్ష విద్యార్థి, యువజన సంఘాల ఐక్య పోరాటానికి దక్కిన తొలి విజయమని నాయకులు పేర్కొన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో అక్రమాలు, అధిక ఫీజుల దోపిడీ, అనుమతులు లేని తరగతుల నిర్వహణపై అఖిలపక్షం ఆధ్వర్యంలో ఇటీవల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి, అధికారులకు వినతిపత్రం సమర్పించినా స్పందన కరువైంది.

​దీంతో ఆగ్రహించిన విద్యాసంఘాల నాయకులు మంగళవారం మౌంట్ లిటెరా జీ స్కూల్ ఎదుట భారీ ధర్నాకు దిగారు. ఉద్యమం ఉధృతం కావడంతో దిగివచ్చిన మండల విద్యాధికారి క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టి, నిబంధనల ఉల్లంఘనలను గుర్తిస్తూ పాఠశాలను సీజ్ చేశారు.​ఈ సందర్భంగా నాయకులు వీరమళ్ళ కార్తీక్ గౌడ్, దిండు భాస్కర్, నలపరాజు రమేష్, పల్లె మధు, కొండూరు వెంకన్న, బండి గారి శ్రీధర్ గౌడ్, పబ్బు వంశీ, తిగుళ్ల శీను, ఒంటెద్దు లింగస్వామి, ఖయ్యూం, రాఘవ మాట్లాడుతూ.. విద్యను వ్యాపారంగా మార్చిన యాజమాన్యాలకు ఇది గట్టి హెచ్చరిక అని పేర్కొన్నారు. బలవంతపు పుస్తకాలు, యూనిఫాంల పేరిట దోపిడీ చేస్తే ఊరుకునేది లేదన్నారు. మండలంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలపై ప్రత్యేక తనిఖీలు జరిపి, నిబంధనలు పాటించని వాటి గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అక్రమాలకు అడ్డుకట్ట పడేవరకు తమ ఉద్యమం ఆగేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అన్నబోయిన సూర్య, పందుల శరత్, గట్టు పవన్, సన్నీ, సాయి కిరణ్, కొప్పు రామకృష్ణ, నవీన్, భాను, శివ, శైలేందర్, ప్రవీణ్, మనోజ్, సుకుమార్ రెడ్డి, సాయి, రాకేష్, ఇర్ఫాన్, ప్రమోద్, అఖిల్ తదితర అఖిలపక్ష విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Sthanikam

అఖిలపక్ష పోరాటానికి తొలి విజయం : చౌటుప్పల్‌లో మౌంట్ లిటెరా జీ స్కూల్ సీజ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News