Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

మాజీ ఎమ్మెల్యే బొల్లం చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకుల ఖండన

Updated : 30 Jun 2026 18:57 IST
As Preferred Source 1 min read
మాజీ ఎమ్మెల్యే బొల్లం చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకుల ఖండన

నల్గొండలో సీఎం రేవంత్ రెడ్డి సభకు ప్రజల నుంచి లభించిన ఆదరణను చూసి బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు రావెళ్ల కృష్ణారావు, మైలారి శెట్టి భాస్కర్ ఆరోపించారు. మంగళవారం కోదాడలో విలేకరులతో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉంటే ప్రజల ముందుంచాలని, లేకుంటే వెంటనే ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత దూషణలు, నిరాధార ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ రాజకీయంగానూ, చట్టపరంగానూ ఎదుర్కొంటుందని స్పష్టం చేశారు.

Sthanikam

మాజీ ఎమ్మెల్యే బొల్లం చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకుల ఖండన

Article Image

నల్గొండలో సీఎం రేవంత్ రెడ్డి సభకు ప్రజల నుంచి లభించిన ఆదరణను చూసి బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు రావెళ్ల కృష్ణారావు, మైలారి శెట్టి భాస్కర్ ఆరోపించారు. మంగళవారం కోదాడలో విలేకరులతో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉంటే ప్రజల ముందుంచాలని, లేకుంటే వెంటనే ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత దూషణలు, నిరాధార ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ రాజకీయంగానూ, చట్టపరంగానూ ఎదుర్కొంటుందని స్పష్టం చేశారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news