Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:32 PM

అనాథ చిన్నారికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. రూ.70 వేల స్థిరనిధి ఏర్పాటు.. మానవత్వం చాటిన బస్వాపురం ఆలుమ్ని

30-06-2026 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బస్వాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2012–13 విద్యాసంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు మానవత్వాన్ని చాటుకున్నారు. తల్లి కోల్పోయి అనాథలైన ఇద్దరు చిన్నారుల భవిష్యత్తు కోసం ఆర్థిక సాయం అందించారు.

ముత్తిరెడ్డిగూడెంకు చెందిన గంగాదేవి జ్యోతి ఇటీవల మృతి చెందడంతో ఆమె కుమార్తె నందిత, కుమారుడు తల్లిని కోల్పోయారు. ఈ విషయం తెలుసుకున్న పూర్వ విద్యార్థులు నందిత ఉన్నత చదువులకు ఉపయోగపడేలా ఆమె పేరుపై పోస్టాఫీస్‌లో కిసాన్ వికాస్ పత్రం (కేవీపీ) కింద రూ.70 వేల స్థిరనిధి (ఎఫ్‌డీ) ఏర్పాటు చేశారు.

పూర్వ విద్యార్థుల ఈ సేవాభావాన్ని పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు, బాలల హక్కుల సంఘం నాయకులు అభినందించారు. చిన్నారుల భవిష్యత్తుకు భరోసా కల్పించే ఈ కార్యక్రమం మరెందరికో ఆదర్శంగా నిలుస్తుందని ప్రశంసించారు.

Sthanikam

అనాథ చిన్నారికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. రూ.70 వేల స్థిరనిధి ఏర్పాటు.. మానవత్వం చాటిన బస్వాపురం ఆలుమ్ని

Article Image

భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బస్వాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2012–13 విద్యాసంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు మానవత్వాన్ని చాటుకున్నారు. తల్లి కోల్పోయి అనాథలైన ఇద్దరు చిన్నారుల భవిష్యత్తు కోసం ఆర్థిక సాయం అందించారు.

ముత్తిరెడ్డిగూడెంకు చెందిన గంగాదేవి జ్యోతి ఇటీవల మృతి చెందడంతో ఆమె కుమార్తె నందిత, కుమారుడు తల్లిని కోల్పోయారు. ఈ విషయం తెలుసుకున్న పూర్వ విద్యార్థులు నందిత ఉన్నత చదువులకు ఉపయోగపడేలా ఆమె పేరుపై పోస్టాఫీస్‌లో కిసాన్ వికాస్ పత్రం (కేవీపీ) కింద రూ.70 వేల స్థిరనిధి (ఎఫ్‌డీ) ఏర్పాటు చేశారు.

పూర్వ విద్యార్థుల ఈ సేవాభావాన్ని పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు, బాలల హక్కుల సంఘం నాయకులు అభినందించారు. చిన్నారుల భవిష్యత్తుకు భరోసా కల్పించే ఈ కార్యక్రమం మరెందరికో ఆదర్శంగా నిలుస్తుందని ప్రశంసించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News