Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:12 PM

పెద్దకాపర్తిలో రైతులకు CRIDA శాస్త్రవేత్తల అవగాహన

01-07-2026 79 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

భూసార పరిరక్షణకు సమతుల్య ఎరువులు, పంట మార్పిడి అవసరం

రసాయన ఎరువుల వినియోగం తగ్గించి సేంద్రియ సాగుపై దృష్టి పెట్టాలని సూచన

చిట్యాల, జూలై 1:

హైదరాబాద్‌కు చెందిన మెట్ట పరిశోధన సంస్థ (CRIDA) శాస్త్రవేత్తలు బుధవారం చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి గ్రామంలో రైతులకు భూసార పరిరక్షణ, సుస్థిర వ్యవసాయ పద్ధతులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. “కేత్ బచావో అభియాన్” మరియు “మేరా గావ్ మేరా గౌరవ్” కార్యక్రమాల కింద జరిగిన ఈ సమావేశంలో రైతులకు వ్యవసాయ భూముల సంరక్షణపై పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు డాక్టర్ గోష్, డాక్టర్ రవికాంత్, మండల వ్యవసాయ అధికారి పగిడిమర్రి గిరిబాబు మాట్లాడుతూ రైతులు అధికంగా రసాయన ఎరువులు వినియోగించడం వల్ల భూసారం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాలకు సారవంతమైన నేలను అందించాలంటే సమతుల్య ఎరువుల వినియోగం, సేంద్రియ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలని సూచించారు.

పెంట ఎరువు, పచ్చిరొట్టె ఎరువులు వంటి సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచాలని, భూసారాన్ని హరించే పత్తి వంటి పంటల సాగును తగ్గించి కంది, పెసర, మినుము వంటి పప్పుధాన్యాలతో పంట మార్పిడి చేపట్టాలని రైతులకు సూచించారు.

నేలల్లో భాస్వరం నిల్వలు అధికంగా ఉన్నందున డీఏపీ వంటి ఎరువుల వినియోగాన్ని తగ్గించి, భాస్వరాన్ని కరిగించే పాస్ఫో బ్యాక్టీరియాను పొలాల్లో వినియోగించాలని తెలిపారు. అలాగే నానో యూరియా, నానో డీఏపీ ఎరువులు సంప్రదాయ రసాయన ఎరువులకు సమర్థవంతమైన ప్రత్యామ్నాయాలని వివరించారు.

కార్యక్రమంలో పెద్దకాపర్తి సర్పంచ్ కాటం వెంకన్న, ఏఈఓ శిల్పతో పాటు గ్రామ రైతులు పాల్గొన్నారు. రైతులు శాస్త్రవేత్తలను వివిధ వ్యవసాయ సమస్యలపై ప్రశ్నించి సలహాలు తీసుకున్నారు.

Sthanikam

పెద్దకాపర్తిలో రైతులకు CRIDA శాస్త్రవేత్తల అవగాహన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News