Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:12 PM

యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డుపై రాజ్‌గోపాల్ రెడ్డి అసంతృప్తి

01-07-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

"సీఎం వ్యవహారశైలి నచ్చలేదు.. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు విలువ లేదు" అంటూ ఘాటు వ్యాఖ్యలు

నల్గొండ:

యాదగిరిగుట్ట ధర్మకర్తల మండలి (ట్రస్ట్ బోర్డు) సభ్యుల నియామకంపై మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రస్ట్ బోర్డు ఏర్పాటుపై తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యానించారు.

"నేను సీనియర్ నాయకుడిని. గతంలో భువనగిరి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశాను. నాకే చెప్పకుండా నిర్ణయాలు తీసుకుంటే ఎలా?" అని ప్రశ్నించారు.ముఖ్యమంత్రి వ్యవహారశైలి తనకు నచ్చకపోవడంతోనే ఇటీవల నల్లగొండలో జరిగిన సభకు హాజరుకాలేదని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేసిన అసలైన కాంగ్రెస్ నేతలకు ప్రస్తుతం తగిన ప్రాధాన్యం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

"కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులు రోజురోజుకు కనుమరుగవుతున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన కొత్తవాళ్లకే ప్రాధాన్యం పెరిగింది. ఇప్పుడు అంతా వాళ్లదే నడుస్తోంది" అని విమర్శించారు.

అలాగే ముఖ్యమంత్రి వ్యవహారశైలిపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ, "సీఎం తీరు అస్సలు బాగోలేదు. షో-అప్స్ ఎక్కువయ్యాయి" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.రాజ్‌గోపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు నియామకాల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Sthanikam

యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డుపై రాజ్‌గోపాల్ రెడ్డి అసంతృప్తి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News