Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:28 PM

ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి అదృశ్యం ఆచూకీ తెలిసిన వారు డయల్‌–100/112 లేదా పోలీసులకు సమాచారం ఇవ్వండి

01-07-2026 51 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివాసం ఉంటున్న శ్రీనివాస్ ఫణి అలియాస్ జానకి ఫణి అదృశ్యమైన ఘటనపై పోలీసులు మాన్‌ మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆయన భార్య శ్రీమతి తనీరు జానకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. గత కొంతకాలంగా శ్రీనివాస్ ఫణి మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నెల 27వ తేదీ తెల్లవారుజామున సుమారు 2.45 గంటలకు ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయి తిరిగి రాలేదు.

కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లు, స్నేహితులు, ఆస్పత్రులు తదితర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించకపోవడంతో వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై FIR నెం.1220/2026 కింద మాన్‌ మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

శ్రీనివాస్ ఫణి ఆచూకీ తెలిసిన వారు వెంటనే డయల్‌–100, 112 లేదా సమీప పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించాలని వనస్థలిపురం పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Sthanikam

ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి అదృశ్యం ఆచూకీ తెలిసిన వారు డయల్‌–100/112 లేదా పోలీసులకు సమాచారం ఇవ్వండి

Article Image

వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివాసం ఉంటున్న శ్రీనివాస్ ఫణి అలియాస్ జానకి ఫణి అదృశ్యమైన ఘటనపై పోలీసులు మాన్‌ మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆయన భార్య శ్రీమతి తనీరు జానకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. గత కొంతకాలంగా శ్రీనివాస్ ఫణి మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నెల 27వ తేదీ తెల్లవారుజామున సుమారు 2.45 గంటలకు ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయి తిరిగి రాలేదు.

కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లు, స్నేహితులు, ఆస్పత్రులు తదితర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించకపోవడంతో వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై FIR నెం.1220/2026 కింద మాన్‌ మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

శ్రీనివాస్ ఫణి ఆచూకీ తెలిసిన వారు వెంటనే డయల్‌–100, 112 లేదా సమీప పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించాలని వనస్థలిపురం పోలీసులు విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News