Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:14 PM

యాదాద్రి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు.. ఏపీ సభ్యుల నియామకంపై వివాదం

30-06-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

యాదాద్రి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా సత్యనారాయణ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మొత్తం 10 మంది సభ్యులతో కూడిన బోర్డును ఖరారు చేసింది.ప్రకటించిన సభ్యుల జాబితాలో ప్రముఖ సినీనటుడు చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ పేరు కూడా ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

అయితే ట్రస్ట్ బోర్డులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తులను సభ్యులుగా నియమించడంపై తెలంగాణ వాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రానికి సంబంధించిన ట్రస్ట్ బోర్డులో స్థానికులకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిందని వారు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు ప్రభుత్వం మాత్రం భక్తుల సేవ, దేవాలయ అభివృద్ధి, పరిపాలనా సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సభ్యుల ఎంపిక చేపట్టినట్లు తెలుస్తోంది. ట్రస్ట్ బోర్డు నియామకాలపై రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.

Sthanikam

యాదాద్రి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు.. ఏపీ సభ్యుల నియామకంపై వివాదం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News