Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:15 PM

భవన నిర్మాణ కార్మిక సంక్షేమ పథకాలు బోర్డు ద్వారానే అమలు చేయాలి

01-07-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

జీవో 12 రద్దు చేసి ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగింత నిలిపివేయాలని సీఐటీయూ డిమాండ్.

చిట్యాల, జూలై 1: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించకుండా, భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ద్వారానే అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు జిట్ట నగేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.భవన నిర్మాణ కార్మిక సంఘం (సీఐటీయూ) చిట్యాల మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న జిట్ట నగేష్ మాట్లాడుతూ, కార్మికుల సంక్షేమానికి సంబంధించిన పథకాలను ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించే జీవో నెం.12ను వెంటనే రద్దు చేయాలని కోరారు. సంక్షేమ బోర్డు ద్వారా ప్రభుత్వం నేరుగా పథకాలను అమలు చేసి కార్మికులకు భరోసా కల్పించాలని అన్నారు.

రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌లకు వెంటనే నిధులు విడుదల చేసి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని చిట్యాల డిప్యూటీ తహశీల్దార్ విజయకు సమర్పించారు.ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు సుక్క నర్సింహా, కార్యదర్శి వడ్డెపల్లి శంకర్, నాయకులు చిర్రబోయిన గట్టయ్య, దోర్నాల సంజీవ్, గూని రమేష్, ఇస్కిళ్ల ఎల్లయ్య, జన్నాయకోడె సత్యనారాయణ, ఐతరాజు నర్సింహా, లడె రాములు, వడ్డెపల్లి నర్సింహా, దొడ్డి యాదయ్యతో పాటు వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Sthanikam

భవన నిర్మాణ కార్మిక సంక్షేమ పథకాలు బోర్డు ద్వారానే అమలు చేయాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News