Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:59 PM

వైద్య వృత్తి ఎంతో మహోన్నతమైనది: త్రినిటీ విద్యాసంస్థల ఆధ్వర్యంలో వైద్యులకు ఘన సన్మానం

01-07-2026 120 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రి, తంగడపల్లి పీహెచ్ సి లు సందర్శించిన విద్యార్థులు

వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని, సమాజంలో వైద్యులను దేవుడిలా భావిస్తారని తంగడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ కాటమయ్య అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా చౌటుప్పల్‌లోని త్రినిటీ విద్యాసంస్థల 9వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులు బుధవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రితో పాటు తంగడపల్లి పీహెచ్‌సీని సందర్శించారు.​వైద్య వృత్తిపై అవగాహన, జిజ్ఞాసతో ఆసుపత్రిలోని వార్డులను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. చౌటుప్పల్‌ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పాండురంగం ఆధ్వర్యంలో వైద్యులను విద్యార్థులు ఘనంగా సన్మానించారు. వారికి మిఠాయిలు తినిపించి, మనీప్లాంట్‌ మొక్కలను బహూకరించి తమ కృతజ్ఞత చాటుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కాటమయ్య మాట్లాడుతూ.. రాత్రింబవళ్లు నిద్రాహారాలు మానేసి రోగుల ప్రాణాలు కాపాడే వైద్యులకు సమాజంలో ఉన్నత గౌరవం ఉందన్నారు. విద్యార్థులను ఉత్తేజపరిచేలా ఇలాంటి సామాజిక కార్యక్రమాలు చేపడుతున్న త్రినిటీ విద్యాసంస్థల మేనేజ్‌మెంట్‌ను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో త్రినిటీ విద్యాసంస్థల చైర్మన్‌ కేవీబీ కృష్ణారావు, డైరెక్టర్‌ అండ్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఉజ్జీని మంజుల, పాఠశాల ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

వైద్య వృత్తి ఎంతో మహోన్నతమైనది: త్రినిటీ విద్యాసంస్థల ఆధ్వర్యంలో వైద్యులకు ఘన సన్మానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News