Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:33 AM

విధుల్లో రాణించాలంటే వృత్తి నైపుణ్యం తప్పనిసరి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

01-07-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహిస్తున్న మూడో జిల్లా స్థాయి పోలీస్ డ్యూటీ మీట్‌ను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలీసు అధికారులు, సిబ్బందిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారి వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకే ఈ డ్యూటీ మీట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. విధుల్లో సమర్థవంతంగా రాణించాలంటే వృత్తి నైపుణ్యంతో పాటు శాస్త్రీయ దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణ, పరిరక్షణపై పూర్తి అవగాహన అవసరమని అన్నారు. తెలంగాణ డీజీపీ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ పోటీల్లో కంప్యూటర్, ఫోరెన్సిక్ సైన్స్, ఫింగర్‌ప్రింట్స్, సాక్ష్యాధారాల హ్యాండ్లింగ్, బాంబ్ డిస్పోజల్, పోలీస్ జాగిలాల ట్రాకింగ్, ఎక్స్‌ప్లోసివ్ హ్యాండ్లింగ్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులతో పాటు జోనల్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్‌లో పాల్గొనే అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ నరేందర్, డీసీఆర్‌బీ డీఎస్పీ సురేందర్ రెడ్డి, ఇన్‌స్పెక్టర్ రమేష్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ సదా నాగరాజు, ఆర్‌ఐలు సురేష్, డానియెల్‌తో పాటు జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

విధుల్లో రాణించాలంటే వృత్తి నైపుణ్యం తప్పనిసరి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News