Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:59 PM

మహిళా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్

01-07-2026 104 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​13వ వార్డులో ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పెద్దపీట వేస్తోందని చౌటుప్పల్ మున్సిపల్ 13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్ అన్నారు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని 13వ వార్డులో బుధవారం ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కౌన్సిలర్ మహిళలకు చీరలను పంపిణీ చేశారు.

​ఈ సందర్భంగా బత్తుల వాణి మాట్లాడుతూ.. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరిటనే మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి సంక్షేమ పథకాలు మహిళా అభ్యున్నతిపై ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనమన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో వార్డులోని మహిళల అభివృద్ధికి మరింత కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వర్కాల కుమార్ గౌడ్, మార్గం నర్సింహ్మ యాదవ్, మొగుదాల రాములు, బొమ్మిరెడ్డి సంజీవరెడ్డి, బయ్య సంపత్, మొగుదాల రాకేష్ గౌడ్, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

మహిళా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News