Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:32 AM

బేగంపేట కిమ్స్, భువనగిరి ఐఎంఎ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకలు

02-07-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ బేగంపేట్‌లోని కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్‌, భువనగిరి ఐఎంఎ (ఇండియన్ మెడికల్ అసోసియేషన్) ఆధ్వర్యంలో బుధవారం రాత్రి భువనగిరి వివేరా హోటల్లో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు డాక్టర్ ప్రభాకర్ మాట్లాడుతూ...సమాజంలో వైద్య వృత్తి ఎంతో పవిత్రమైందని, భగవంతుడు జన్మనిస్తే, వైద్యులు పునర్జన్మ ప్రసాదిస్తారని ఆయన అన్నారు. వైద్యులు, ప్రజలతో ఆర్థిక సంబందాలు కాకుండా ఆత్మీయ బందాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ప్రతి డాక్టర్, ప్రజలందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటారని, కానీ కొందరు ప్రజలు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేస్తూ, రోగాల బారిన పడుతున్నారని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఐఎంఎ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కృష్ణ చైతన్య, కోశాధికారి డాక్టర్ కిరణ్,సభ్యులు డాక్టర్ ప్రశాంతి రెడ్డి,డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి ,బేగంపేట కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్‌కు చెందిన సీనియర్ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ నివేదిత సాయిచంద్ర ఎ.ప్రసూతి, గైనకాలజీ నిపుణురాలు డాక్టర్ అశ్విని దేవరశెట్టి, సీనియర్ పల్మోనాలజిస్ట్ డాక్టర్ వి.లక్ష్మణ్ బాబు,సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ కె. సాయి కృష్ణ, సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ కిరణ్ మాచా,కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్ డీజీఎం-బిజినెస్ డెవలప్‌మెంట్ అజయ్ ఠాకూర్,అసిస్టెంట్ మేనేజర్ యశ్వంత్ తదితరులు పాల్గొని అతిథులను ఆహ్వానించి సత్కరించారు.వైద్యుల సేవలను కొనియాడుతూ జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

Sthanikam

బేగంపేట కిమ్స్, భువనగిరి ఐఎంఎ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News