Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:53 PM

గూగుల్ పే QR కోడ్ పేరుతో కొత్త మోసం.. వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి: కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి

02-07-2026 110 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి ఒక ప్రకటనలో మాట్లాడుతూ, సైబర్ నేరగాళ్లు గూగుల్ పే QR కోడ్ సౌండ్ బాక్స్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. కంగ్టి గ్రామ పరిధిలో కొంతమంది షాప్ యజమానులకు గూగుల్ పే నుంచి మాట్లాడుతున్నామని ఫోన్ చేసి, ఒక QR కోడ్ పంపిస్తామని, దానిని స్కాన్ చేసి రూ.5,000 చెల్లిస్తే ఇప్పటివరకు కట్ అయిన ఛార్జీలతో కలిపి రూ.10,000 రిఫండ్ వస్తుందని నమ్మిస్తున్నారు. ఈ మాటలు నమ్మి ఒక వ్యాపారి QR కోడ్ స్కాన్ చేసి, తన షాప్ పేరు కనిపించడంతో పాస్‌వర్డ్ నమోదు చేయగా అతని ఖాతా నుంచి రూ.9,500 మాయమయ్యాయి. ఇదే విధంగా నలుగురు వ్యాపారుల నుంచి సుమారు రూ.40 వేల వరకు సైబర్ నేరగాళ్లు కాజేశారు. గూగుల్ పే లేదా ఇతర డిజిటల్ చెల్లింపు సంస్థల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్, QR కోడ్‌లు, లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని, స్కాన్ చేయవద్దని, అనుమానం వచ్చిన వెంటనే పోలీసులను లేదా సైబర్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సీఐ వెంకట్ రెడ్డి ప్రజలకు సూచించారు.

Sthanikam

గూగుల్ పే QR కోడ్ పేరుతో కొత్త మోసం.. వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి: కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి ఒక ప్రకటనలో మాట్లాడుతూ, సైబర్ నేరగాళ్లు గూగుల్ పే QR కోడ్ సౌండ్ బాక్స్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. కంగ్టి గ్రామ పరిధిలో కొంతమంది షాప్ యజమానులకు గూగుల్ పే నుంచి మాట్లాడుతున్నామని ఫోన్ చేసి, ఒక QR కోడ్ పంపిస్తామని, దానిని స్కాన్ చేసి రూ.5,000 చెల్లిస్తే ఇప్పటివరకు కట్ అయిన ఛార్జీలతో కలిపి రూ.10,000 రిఫండ్ వస్తుందని నమ్మిస్తున్నారు. ఈ మాటలు నమ్మి ఒక వ్యాపారి QR కోడ్ స్కాన్ చేసి, తన షాప్ పేరు కనిపించడంతో పాస్‌వర్డ్ నమోదు చేయగా అతని ఖాతా నుంచి రూ.9,500 మాయమయ్యాయి. ఇదే విధంగా నలుగురు వ్యాపారుల నుంచి సుమారు రూ.40 వేల వరకు సైబర్ నేరగాళ్లు కాజేశారు. గూగుల్ పే లేదా ఇతర డిజిటల్ చెల్లింపు సంస్థల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్, QR కోడ్‌లు, లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని, స్కాన్ చేయవద్దని, అనుమానం వచ్చిన వెంటనే పోలీసులను లేదా సైబర్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సీఐ వెంకట్ రెడ్డి ప్రజలకు సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News