Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:24 PM

తెలంగాణ ఉద్యమకారుల ముందస్తు అరెస్ట్

తెలంగాణ ఉద్యమకారుల ముందస్తు అరెస్ట్

తెలంగాణ ఉద్యమకారుల ముందస్తు అరెస్ట్
02-07-2026 113 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించనున్న 'చలో భూదాన్' కార్యక్రమానికి వెళ్లకుండా రామన్నపేట మండలంలోని పలువురు తెలంగాణ ఉద్యమకారులను పోలీసులు గురువారం ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఇచ్చిన పిలుపు మేరకు కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధమైన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులను పోలీసులు వారి నివాసాల వద్దే అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

అరెస్టయిన వారిలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎస్‌కే చాంద్, మండల అధ్యక్షుడు నోముల శంకర్, మండల ఉపాధ్యక్షుడు బొడ్డుపల్లి లింగయ్య, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండీ ఇమామ్ తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా ఉద్యమకారులు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలం కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాంతియుతంగా తమ హక్కుల కోసం నిర్వహించే కార్యక్రమాలను అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వారు విమర్శించారు.

Sthanikam

తెలంగాణ ఉద్యమకారుల ముందస్తు అరెస్ట్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News