నారాయణఖేడ్ నియోజకవర్గంలో కంగ్టి మండల కేంద్రంలోని వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలుర వసతి గృహంలో జరుగుతున్న అభివృద్ధి పనులను నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఎన్. ఉమా హారతి పరిశీలించారు. వసతి గృహంలోని మౌలిక వసతులు, కొనసాగుతున్న పనుల పురోగతిని పరిశీలించిన ఆమె, మిగిలిన అభివృద్ధి పనులను నాణ్యతతో పాటు త్వరితగతిన పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ శాఖ అధికారులకు సూచించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
సతి గృహ అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి: సబ్ కలెక్టర్
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి