Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:29 PM

వైద్య వృత్తి అత్యంత పవిత్రమైనది జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకల్లో డాక్టర్ ప్రభాకర్

02-07-2026 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బేగంపేట కిమ్స్–సన్‌షైన్ హాస్పిటల్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) యాదాద్రి భువనగిరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి భువనగిరిలోని వివేరా హోటల్‌లో వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ప్రభాకర్ మాట్లాడుతూ.. సమాజంలో వైద్య వృత్తి అత్యంత పవిత్రమైనదని, భగవంతుడు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మ ప్రసాదిస్తారని అన్నారు. వైద్యులు ప్రజలతో ఆర్థిక సంబంధాలకే పరిమితం కాకుండా ఆత్మీయ అనుబంధాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ప్రతి వైద్యుడు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనే లక్ష్యంతో పనిచేస్తాడని, ప్రజలు కూడా ఆరోగ్యంపై నిర్లక్ష్యం వీడి జాగ్రత్తలు పాటించాలని కోరారు.

కార్యక్రమంలో ఐఎంఏ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కృష్ణచైతన్య, కోశాధికారి డాక్టర్ కిరణ్, సభ్యులు డాక్టర్ ప్రశాంతి రెడ్డి, డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి, కిమ్స్–సన్‌షైన్ హాస్పిటల్‌కు చెందిన సీనియర్ న్యూరో ఫిజీషియన్ డాక్టర్ నివేదిత సాయిచంద్ర, ప్రసూతి, గైనకాలజీ నిపుణురాలు డాక్టర్ అశ్విని దేవరశెట్టి, పల్మోనాలజిస్ట్ డాక్టర్ వి. లక్ష్మణ్ బాబు, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ కె. సాయికృష్ణ, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ కిరణ్ మాచా, డీజీఎం అజయ్ ఠాకూర్, అసిస్టెంట్ మేనేజర్ యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యుల సేవలను కొనియాడుతూ వారిని సత్కరించారు.వేడుకలు

Sthanikam

వైద్య వృత్తి అత్యంత పవిత్రమైనది జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకల్లో డాక్టర్ ప్రభాకర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News