Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:11 PM

పోక్సో బాధితులకు వేగవంతమైన సేవలు.. అన్ని శాఖల సమన్వయం కీలకం: జిల్లా ఎస్పీ

02-07-2026 100 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

పోక్సో, అత్యాచార కేసుల్లో మహిళలు, చిన్నారులకు వేగవంతమైన న్యాయం, వైద్య సహాయం, కౌన్సెలింగ్, పునరావాస సేవలు అందించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్. అన్నారు. తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం డీజీపీ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా భరోసా సెంటర్ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా స్థాయి స్టేక్‌హోల్డర్స్ కన్వర్జెన్స్ సమావేశం నిర్వహించారు.సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ, బాధితులకు అవసరమైన అన్ని సేవలు ఒకే వేదికపై అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు, వారు మళ్లీ మానసిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ట్రామా హీలింగ్, కౌన్సెలింగ్, పునరావాస సేవలు సమర్థవంతంగా అందించాలని సూచించారు. భరోసా సెంటర్‌లో మెడికల్ ఆఫీసర్ నియామకం, వైద్య నివేదికల నాణ్యత మెరుగుదల, విక్టిమ్ కాంపెన్సేషన్ కేసుల పురోగతి, చదువు మానేసిన బాధిత బాలికలకు తిరిగి విద్యా అవకాశాలు కల్పించడం, పోక్సో చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వంటి అంశాలపై చర్చించారు.అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ, అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తే బాధితులకు త్వరితగతిన న్యాయం, వైద్య, న్యాయ సహాయం, కౌన్సెలింగ్, పునరావాస సేవలు మరింత సమర్థవంతంగా అందుతాయని తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా వైద్య, జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి,చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, డీఎల్‌ఎస్‌ఏ, డీఆర్‌డీఏ, పోలీసు శాఖ, భరోసా సెంటర్ అధికారులు, సిబ్బంది తదితర శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.

Sthanikam

పోక్సో బాధితులకు వేగవంతమైన సేవలు.. అన్ని శాఖల సమన్వయం కీలకం: జిల్లా ఎస్పీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News