ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో ప్రతి అర్హత కలిగిన ఓటరు తప్పనిసరిగా పాల్గొని తమ వివరాలను సక్రమంగా నమోదు చేయించాలని సంగారెడ్డి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింత గోపాల్ కోరారు. ఓటు హక్కు కలిగిన ప్రతి స్త్రీ, పురుషుడు ఎస్‌ఐఆర్ ఫారాన్ని పూర్తిగా నింపి సంబంధిత అధికారులకు అందజేయాలని, ఓటరు జాబితాలో సరైన వివరాలు నమోదు కావడం ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఎంతో ముఖ్యమని అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఈ ప్రక్రియలో భాగస్వాములై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీఎల్‌వోలు మల్లీశ్వరి, శివకుమార్, మల్లేశం, చింత ఆనంద్, మురళి గౌడ్, ఆదర్శ్ కుమార్, ఆకుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఓటరు పాల్గొని సహకరించాలి:చింత గోపాల్
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి