Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:29 PM

ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: బీజేపీ నాయకుడు జగదీష్ గౌడ్

03-07-2026 80 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రంగారెడ్డి జిల్లా, మంచాల మండలం (లోయపల్లి): భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని ప్రతి ఓటరు సద్వినియోగం చేసుకుని విజయవంతం చేయాలని బీజేపీ నాయకుడు జగదీష్ గౌడ్ పిలుపునిచ్చారు.

లోయపల్లి గ్రామంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన ఇంటింటికీ వెళ్లి ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటరు వివరాలను పరిశీలించి, కొత్తగా పేరు నమోదు చేయించుకోవడం, తప్పులు ఉంటే సరిచేయించుకోవడం, అవసరమైన మార్పులు చేయించుకోవాలని సూచించారు.

ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన హక్కు అని, ప్రతి పౌరుడు తన ఓటు హక్కును పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందని జగదీష్ గౌడ్ పేర్కొన్నారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమం ద్వారా పారదర్శకమైన, ఖచ్చితమైన ఓటరు జాబితా రూపొందుతుందని, అందువల్ల ప్రతి ఓటరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, బూత్ కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొని ప్రజలకు అవసరమైన సమాచారం అందిస్తూ ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేశారు

Sthanikam

ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: బీజేపీ నాయకుడు జగదీష్ గౌడ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News