Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:58 PM

రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు మల్కాపురం విద్యార్థినులు ఎంపిక

03-07-2026 83 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మండల పరిధిలోని దండు మల్కాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికై ప్రతిభ చాటారు. ఆ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న జి. భవ్య, 7వ తరగతి చదువుతున్న వై. రష్మిక ఈ ఘనత సాధించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం (జూలై 2న) నల్గొండ జిల్లా చర్లపల్లిలో సబ్ జూనియర్ (అండర్-14) బాలికల జట్టు ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మల్కాపురం జెడ్పీ ఉన్నత పాఠశాల నుంచి ఆరుగురు విద్యార్థినులు పాల్గొనగా, వారిలో భవ్య, రష్మిక అద్భుత క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు.

​నిజామాబాద్‌లో పోటీలు

​రాష్ట్రస్థాయికి ఎంపికైన ఈ విద్యార్థినులు ఈనెల 3, 4, 5 తేదీల్లో నిజామాబాద్‌లో నిర్వహించబోయే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ ఫుట్‌బాల్ పోటీల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా జట్టు తరఫున పాల్గొననున్నారు.

​పాఠశాలలో సంబరాలు - అభినందనల జల్లు:

గ్రామీణ ప్రాంత పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థినులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడంపై పాఠశాలలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిభ చాటిన విద్యార్థినులను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆర్. శోభ, ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) భావనతో పాటు తోటి ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించి, రాష్ట్రస్థాయి పోటీల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు

Sthanikam

రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు మల్కాపురం విద్యార్థినులు ఎంపిక

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News