Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:12 PM

ప్రభుత్వ పాఠశాలల సమస్యల పరిష్కారానికి SFI ధర్నా

03-07-2026 244 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల ఎంఈవో కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘం ఆందోళన.

చిట్యాల, జూలై 3: ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు శుక్రవారం చిట్యాల మండల విద్యాశాఖాధికారి (ఎంఈవో) కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నాయకులు ఆరోపించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు అందజేయాలని, పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న పీటీ ఉపాధ్యాయ పోస్టును వెంటనే భర్తీ చేయాలని కోరారు.

అలాగే మండలంలోని రెండు బీసీ హాస్టళ్ల విద్యార్థులకు ట్రంకు బాక్సులు అందించడంతో పాటు హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు. పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ స్పందించని సంబంధిత అధికారిపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.ధర్నా అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నకిరేకల్ డివిజన్ అధ్యక్షుడు అరూరి ప్రణీత్, కార్యదర్శి ముసుగు రవీందర్, మండల కమిటీ సభ్యులు బొడ్డుపల్లి శశికుమార్, గోల్చింటూ శివప్రసాద్, సంజయ్, విద్యార్థి విద్యార్థినీలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ పాఠశాలల సమస్యల పరిష్కారానికి SFI ధర్నా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News