Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్నేహానికి చావు లేదు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:55 PM

ట్రినిటీ స్కూల్ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన

03-07-2026 212 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

* అక్రమంగా స్టేషనరీ విక్రయాలు, అధిక ఫీజులపై ఆగ్రహం

​* పాఠశాల ముట్టడికి యత్నం.. పోలీసులతో వాగ్వాదం

* నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు .. చౌటుప్పల్‌లో ఉద్రిక్తత

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని ట్రినిటీ ప్రైవేటు పాఠశాల వద్ద శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల ప్రాంగణంలోనే అక్రమంగా స్టేషనరీ విక్రయిస్తూ, తల్లిదండ్రుల నుంచి భారీగా సొమ్ము గుంజుతున్నారంటూ విద్యార్థి సంఘాల నాయకులు స్కూల్ ఎదుట ధర్నాకు దిగారు. యాజమాన్యం దోపిడీని అరికట్టాలని, పాఠశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.​ఆందోళనలో భాగంగా విద్యార్థి సంఘాల నేతలు పాఠశాల లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో పోలీసులకు వ్యతిరేకంగా నాయకులు నినాదాలు చేశారు. స్కూల్ యాజమాన్యంతో పోలీసులు కుమ్మక్కయ్యారని, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు.​"అక్రమంగా స్టేషనరీ అమ్ముతూ, అధిక ఫీజులు వసూలు చేస్తున్న ట్రినిటీ పాఠశాల గుర్తింపును రద్దు చేసి, వెంటనే సీజ్ చేయాలి."

​కొద్దిసేపటి పాటు పాఠశాల ఆవరణ అంతా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి, ఆందోళనకారులను బలవంతంగా అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అనంతరం పరిస్థితి సద్దుమణిగింది. ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు స్పందించి ప్రైవేట్ పాఠశాలల దోపిడీ నుంచి తల్లిదండ్రులను కాపాడాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.

Sthanikam

ట్రినిటీ స్కూల్ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News