Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:12 PM

చిట్యాల మండలానికి కొత్త ఎంపీడీవోగా జె. పాండు బాధ్యతల స్వీకరణ

03-07-2026 206 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల, జూలై 3:

చిట్యాల మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)గా జె. పాండు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు రాష్ట్ర ఎన్నికల సంఘం, హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న ఆయనను చిట్యాల మండలానికి బదిలీ చేయగా, నూతన ఎంపీడీవోగా పదవీ బాధ్యతలు చేపట్టారు.కార్యాలయంలో జరిగిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది జె. పాండును మర్యాదపూర్వకంగా స్వాగతించారు. అనంతరం ఆయన కార్యాలయ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించి, మండల అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, గ్రామపంచాయతీల పరిపాలనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జె. పాండు మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాల అమలులో పారదర్శకత, సమర్థతకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.మండల ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించి, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ పథకాల ఫలాలు అర్హులందరికీ చేరేలా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

Sthanikam

చిట్యాల మండలానికి కొత్త ఎంపీడీవోగా జె. పాండు బాధ్యతల స్వీకరణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News