Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:17 PM

ఈ-పంట నమోదులో పురోగతి.. జగన్ ఆరోపణలు నిరాధారం: అచ్చెన్నాయుడు

03-07-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అమరావతి, జులై 3: ఈ-పంట నమోదుపై మాజీ సీఎం జగన్ చేస్తున్న ఆరోపణలు వాస్తవాలకు విరుద్ధమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వైసీపీ హయాంలో కంటే కూటమి ప్రభుత్వం ఈ-పంట నమోదులో గణనీయమైన పురోగతి సాధించిందని తెలిపారు. సాక్షి పత్రికలో వస్తున్న కథనాలు రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని విమర్శించారు.

ఖరీఫ్-2024లో 41.87 లక్షల మంది రైతుల 96.78 లక్షల ఎకరాలు నమోదు కాగా, ఖరీఫ్-2025లో 53.32 లక్షల మంది రైతుల 117.39 లక్షల ఎకరాలు నమోదు చేశామని వెల్లడించారు. ల్యాండ్ పార్సిల్స్ నమోదు కూడా 106.38 లక్షల నుంచి 198.93 లక్షలకు పెరిగిందన్నారు. రబీ 2025-26లో 99.7 శాతం ఈ-పంట నమోదు పూర్తయిందని చెప్పారు.

ఖరీఫ్-2026లో APAIMS 2.0 ద్వారా జియో-రెఫరెన్సింగ్, కృత్రిమ మేధ (AI), ఉపగ్రహ సాంకేతికత ఆధారంగా డిజిటల్ పంట నమోదు చేపడుతున్నట్లు తెలిపారు. రైతులు స్వయంగా నమోదు చేసుకునే అవకాశం, ఎస్‌ఎంఎస్ సమాచారం, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ వంటి పారదర్శక విధానాలను అమలు చేస్తున్నామని చెప్పారు.

ఈ ఏడాది ఇప్పటివరకు 11.75 లక్షల ఎకరాల్లో సాగు జరిగినప్పటికీ, 30 రోజుల వయస్సు దాటిన పంటలనే ఈ-పంటలో నమోదు చేస్తామని వివరించారు. ఇప్పటివరకు 1.62 లక్షల మంది రైతులకు చెందిన 4.03 లక్షల ఎకరాల నమోదు పూర్తయిందన్నారు. రైతులకు సబ్సిడీలు, బీమా, పెట్టుబడి సాయం పారదర్శకంగా అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

కొబ్బరి ధరలపై తప్పుడు ప్రచారం: మంత్రి

కొబ్బరి ధరలు పడిపోయాయంటూ జరుగుతున్న ప్రచారం వాస్తవాలకు విరుద్ధమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. గత రెండేళ్లుగా రైతులకు గిట్టుబాటు ధరలు లభిస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం కూడా బంతి కొబ్బరి వెయ్యి కాయలకు రూ.14 వేల నుంచి రూ.18 వేల వరకు, కోప్రాకు రూ.15 వేల నుంచి రూ.24 వేల వరకు ధర ఉందని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో తప్పుడు కథనాలతో మార్కెట్‌ను ప్రభావితం చేయాలని చూడడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. రైతులను తప్పుదోవ పట్టించే ప్రచారాలను మానుకోవాలని మంత్రి సూచించారు.

Sthanikam

ఈ-పంట నమోదులో పురోగతి.. జగన్ ఆరోపణలు నిరాధారం: అచ్చెన్నాయుడు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News