Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:19 PM

బస్సు కోసం విద్యార్థుల పోరుబాట మూడేళ్లుగా నిలిచిన రామన్నపేట–అమ్మనబోలు ఆర్టీసీ సర్వీసు

03-07-2026 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, : రామన్నపేట–అమ్మనబోలు రూట్లో మూడేళ్లుగా ఆర్టీసీ బస్సు సేవలు నిలిచిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు వేముల నాగరాజు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే బస్సు సేవలను పునరుద్ధరించాలని, లేకపోతే విద్యార్థులతో కలిసి నల్లగొండ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ (ఆర్ఎం) కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

ఈ మేరకు శుక్రవారం రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం నాగరాజు మాట్లాడుతూ.. ఈ రూట్ పరిధిలోని తొమ్మిది గ్రామాలకు చెందిన సుమారు 500 మంది విద్యార్థులు ప్రతిరోజూ రామన్నపేటలోని కళాశాలలు, పాఠశాలలకు రావాల్సి ఉంటుందని, ఆర్టీసీ బస్సు లేక ప్రైవేట్ వాహనాలనే ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

రోజుకు ఒక్కో విద్యార్థి సుమారు రూ.100 వరకు అదనపు ఖర్చు భరించాల్సి వస్తోందని, ఇది పేద, మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారిందని తెలిపారు. పలుమార్లు ఆర్టీసీ, ప్రభుత్వ అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా స్పందించకపోవడం బాధాకరమన్నారు. విద్యార్థుల సమస్యల పట్ల అధికారుల నిర్లక్ష్యం తగదని విమర్శించారు.

బస్సు వచ్చేదాకా ఉద్యమమే..

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వెంటనే రామన్నపేట–అమ్మనబోలు రూట్లో ఆర్టీసీ బస్సు సేవలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి నల్లగొండ ఆర్ఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని, బస్సు సేవలు పునరుద్ధరించే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్‌కుమార్, నాయకులు తుర్కపల్లి లోకేష్ యాదవ్, ముకిడి ప్రవీణ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బస్సు కోసం విద్యార్థుల పోరుబాట మూడేళ్లుగా నిలిచిన రామన్నపేట–అమ్మనబోలు ఆర్టీసీ సర్వీసు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News