Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:22 PM

బీఎల్ఓ యాప్‌లో వివరాలు తప్పుల్లేకుండా నమోదు చేయాలి. ఓటరు జాబితా సవరణలో పారదర్శకత పాటించాలి: కలెక్టర్ నారాయణరెడ్డి

03-07-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చైతన్యపురి

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల ద్వారా సేకరించిన వివరాలను బీఎల్ఓ యాప్‌లో ఖచ్చితంగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎల్బీనగర్ జోన్ పరిధిలో ఇంటింటి ఎన్యుమరేషన్ ప్రక్రియను పరిశీలించారు.

ప్రతి ఇంటిని సందర్శించి అర్హులైన ఓటర్లకు ఫారాలు అందజేయడంతో పాటు, పూర్తి చేసిన వివరాలను వెంటనే యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. ఓటరు జాబితాలో నకిలీ నమోదులు, అనర్హుల పేర్లు, సాంకేతిక తప్పిదాలకు తావులేకుండా పారదర్శకంగా జాబితా రూపొందించాలని ఆదేశించారు.

మరణించిన ఓటర్ల పేర్ల తొలగింపు, డూప్లికేట్ ఈపీఐసీ కార్డుల గుర్తింపు, నివాసం మారిన వారి వివరాల నవీకరణను బాధ్యతగా చేపట్టాలని సూచించారు. ప్రతి అర్హుడికి ఒకే ఓటరు గుర్తింపు కార్డు ఉండేలా చర్యలు తీసుకోవాలని, బీఎల్ఓలు ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ నిర్ణీత గడువులోగా ఎన్యుమరేషన్ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

Sthanikam

బీఎల్ఓ యాప్‌లో వివరాలు తప్పుల్లేకుండా నమోదు చేయాలి. ఓటరు జాబితా సవరణలో పారదర్శకత పాటించాలి: కలెక్టర్ నారాయణరెడ్డి

Article Image

చైతన్యపురి

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల ద్వారా సేకరించిన వివరాలను బీఎల్ఓ యాప్‌లో ఖచ్చితంగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎల్బీనగర్ జోన్ పరిధిలో ఇంటింటి ఎన్యుమరేషన్ ప్రక్రియను పరిశీలించారు.

ప్రతి ఇంటిని సందర్శించి అర్హులైన ఓటర్లకు ఫారాలు అందజేయడంతో పాటు, పూర్తి చేసిన వివరాలను వెంటనే యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. ఓటరు జాబితాలో నకిలీ నమోదులు, అనర్హుల పేర్లు, సాంకేతిక తప్పిదాలకు తావులేకుండా పారదర్శకంగా జాబితా రూపొందించాలని ఆదేశించారు.

మరణించిన ఓటర్ల పేర్ల తొలగింపు, డూప్లికేట్ ఈపీఐసీ కార్డుల గుర్తింపు, నివాసం మారిన వారి వివరాల నవీకరణను బాధ్యతగా చేపట్టాలని సూచించారు. ప్రతి అర్హుడికి ఒకే ఓటరు గుర్తింపు కార్డు ఉండేలా చర్యలు తీసుకోవాలని, బీఎల్ఓలు ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ నిర్ణీత గడువులోగా ఎన్యుమరేషన్ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News