Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:16 PM

గుండెపోటుతో పీజీ విద్యార్థిని మృతి

గుండెపోటుతో పీజీ విద్యార్థిని మృతి

గుండెపోటుతో పీజీ విద్యార్థిని మృతి
03-07-2026 290 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎన్‌జీ కళాశాలలో విషాదం.. అధ్యాపకులు, విద్యార్థుల సంతాపం

నల్గొండ: నాగార్జున ప్రభుత్వ (ఎన్‌జీ) కళాశాలలో ఎం.ఏ. తెలుగు ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కంపటి శోభ (23) గుండెపోటుతో శుక్రవారం మృతి చెందినట్లు కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డా. పరంగి రవికుమార్ తెలిపారు.

కోదాడకు చెందిన కంపటి శ్రీను, సుజాత దంపతుల రెండో కుమార్తె శోభకు 12 రోజుల క్రితం గుండె నొప్పి రావడంతో నల్లగొండలోని ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతున్నప్పటికీ ఆరోగ్య పరిస్థితి విషమించి శుక్రవారం గుండె పనిచేయడం ఆగిపోవడంతో ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

ప్రతిభావంతమైన విద్యార్థిని అకాల మరణం కళాశాల వర్గాలను, కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టిందని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. శోభ మృతిపట్ల వైస్ ప్రిన్సిపాల్ డా. అంతటి శ్రీనివాసులు, తెలుగు శాఖాధ్యక్షుడు డా. వెల్దండి శ్రీధర్, అధ్యాపకులు శ్రవణ్ కుమార్, వనజ, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

Sthanikam

గుండెపోటుతో పీజీ విద్యార్థిని మృతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News