Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా వ్యాపారవేత్త గోదల వెంకటరెడ్డి జన్మదిన వేడుక 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 10:13 PM

నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు రక్షణకై పోరాటం చేద్దాం: దండంపల్లి సత్తయ్య

నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు రక్షణకై పోరాటం చేద్దాం: దండంపల్లి సత్తయ్య

నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు రక్షణకై  పోరాటం చేద్దాం: దండంపల్లి సత్తయ్య
July 03, 2026 09:10 PM 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

భవన నిర్మాణ కార్మికుల పోరాట ఫలితంగా ఏర్పడిన భవననిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు రద్దు చేయాలని చేస్తున్న కుట్రలు తిప్పి కొట్టి సంక్షేమ బోర్డు రక్షణకై ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దండెంపల్లి సత్తయ్య పిలుపునిచ్చారు.

శుక్రవారం నల్గొండ పట్టణంలో17వ డివిజన్ ఆర్జాలబావిలో తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ యూనియన్. (సీఐటీయూ). ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించి అనంతరం నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా దండంపెల్లి సత్తయ్య మాట్లాడుతూ. నల్లగొండ పట్టణంలో జూలై 1 నుండి ఏడో తారీఖు వరకు తాపీ మేస్త్రీ మరియు కార్మికుల కూలి రేట్లు పెంపు కోసం తాపీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె జరుగుతున్నదని తెలిపారు ఈ సమావేశంలో నిర్ణయాలు చేసుకొని భవిష్యత్తులో అన్ని రంగాల పనిచేస్తున్న కార్మికులు కూలి రేట్లు కొరకు జరుగుతున్న సమ్మెలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు సంబంధించిన సంక్షేమ పథకాలు అమలు చేయడంలో 55 ఏళ్లు నిండిన కార్మికులకు 9,000 పెన్షన్ ఇవ్వాలని ,సహజంగా మరణించిన కార్మికులకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని. వెల్ఫేర్ బోర్డు నిధులు ప్రైవేటు ఇన్సూరెన్స్లకు అప్పజెప్పొద్దు నేరుగా వెల్ఫేర్ బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు

,తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్. (సీఐటీయూ ) జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అవుట రవీందర్ మాట్లాడుతూ. రేట్లు పెంపు కోసం కార్మికులందరూ కూడా ఐక్యంగా ఉండి మీ రేట్లు పెంచుకొని. కార్మికులందరూ ఐక్యంగా ఉండాలని. రాష్ట్ర ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డు సంబంధించిన సొమ్ము. సి ఎస్ సి. టెస్టుల పేరుతో సుమారు 750 కోట్ల రూపాయలు ప్రైవేట్ వ్యక్తులకు దారా దత్తం చేస్తుందని. భవిష్యత్తులో వెల్ఫేర్ బోర్డు రక్షణకై జరిగే పోరాటాల్లో భవనిర్మానంగాల్లో పనిచేస్తున్న కార్మికులందరూ ఐక్యంగా ముందు కొనసాగాలని పిలుపునిచ్చారు

ఈ కార్యక్రమంలో. . బీసీడబ్ల్యూ.యూ తాపీ కార్మిక సంఘం పట్టణ అధ్యక్షులు. తాలూకా వెంకన్న, మర్రిగూడ అధ్యక్షులు సుంకరబోయిన రవి, అర్జాలబావి తాపీ కార్మిక సంఘం నాయకులు కట్ట గోవర్ధన్. చింతపల్లి శీను, బుట్టి సైదులు, పెంటమల్ల నరసింహ, ఏకుల రమేష్ ,కడం రాందాస్, ఒలికి చిన్న శంకర్, తాలూకా చిన్న అంజయ్య, గాదరి నాగరాజు ,మేకల వెంకన్న, కట్ట హనుమంతు, ఆవుల వెంకన్న, తాలూకా కాశయ్య, తాలూకా నరేష్, గాదరి సహదేవులు, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News