Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:32 AM

గ్రామీణ పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్య అందించడానికే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్: ఉత్తమ్ కుమార్ రెడ్డి

03-07-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

గడ్డిపల్లిలో రూ.250 కోట్లతో నిర్మిస్తున్న రెసిడెన్షియల్ స్కూల్ పనుల పరిశీలన

గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో రూ.250 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను శుక్రవారం రాష్ట్ర నీటిపారుదల, ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్‌తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి ఇంగ్లీష్ మీడియం బోర్డింగ్ విద్య అందించాలనే లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హుజూర్‌నగర్ నియోజకవర్గానికి చెందిన వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా అన్ని ఆధునిక సౌకర్యాలతో ఈ విద్యాసంస్థను నిర్మిస్తున్నామని చెప్పారు.

రూ.250 కోట్లతో నిర్మిస్తున్న ఈ విద్యాసంస్థలో 2,500 మంది విద్యార్థులు నివాసంతో పాటు విద్యను అభ్యసించేలా అన్ని వసతులు కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, పనుల పురోగతిని పరిశీలించేందుకే తాను సందర్శించినట్లు చెప్పారు. 2027 నాటికి నిర్మాణ పనులు పూర్తి చేసి అదే విద్యా సంవత్సరంలో తరగతులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో హుజూర్‌నగర్ ఆర్డీవో శ్రీనివాసులు, ఇన్‌చార్జి తహసీల్దార్ స్రవంతి, ఆర్ అండ్ బి ఎస్‌ఈ సీతారామయ్య, గుత్తేదారులు, ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గ్రామీణ పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్య అందించడానికే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Article Image

గడ్డిపల్లిలో రూ.250 కోట్లతో నిర్మిస్తున్న రెసిడెన్షియల్ స్కూల్ పనుల పరిశీలన

గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో రూ.250 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను శుక్రవారం రాష్ట్ర నీటిపారుదల, ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్‌తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి ఇంగ్లీష్ మీడియం బోర్డింగ్ విద్య అందించాలనే లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హుజూర్‌నగర్ నియోజకవర్గానికి చెందిన వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా అన్ని ఆధునిక సౌకర్యాలతో ఈ విద్యాసంస్థను నిర్మిస్తున్నామని చెప్పారు.

రూ.250 కోట్లతో నిర్మిస్తున్న ఈ విద్యాసంస్థలో 2,500 మంది విద్యార్థులు నివాసంతో పాటు విద్యను అభ్యసించేలా అన్ని వసతులు కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, పనుల పురోగతిని పరిశీలించేందుకే తాను సందర్శించినట్లు చెప్పారు. 2027 నాటికి నిర్మాణ పనులు పూర్తి చేసి అదే విద్యా సంవత్సరంలో తరగతులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో హుజూర్‌నగర్ ఆర్డీవో శ్రీనివాసులు, ఇన్‌చార్జి తహసీల్దార్ స్రవంతి, ఆర్ అండ్ బి ఎస్‌ఈ సీతారామయ్య, గుత్తేదారులు, ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News